ప్రచార హోరు..


Wed,September 12, 2018 11:23 PM

-కాటేపల్లి, పుల్లాయిగూడెం, చౌటుప్పల్‌లో హోరెత్తిన ర్యాలీలు
-టీఆర్‌ఎస్ అభ్యర్థులకు స్థానికులు బ్రహ్మరథం
-పుల్లాయిగూడెంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, చౌటుప్పల్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రచారం ప్రారంభం
-భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని వేడుకోలు
మోటకొండూర్(యాదగిరిగుట్ట రూరల్), ఆత్మకూరు(ఎం) : ఎన్నికల ప్రచారం హోరెత్తింది. గులాబీ దండు ప్రజాక్షేత్రంలోకి దూసుకువెళ్తున్నది. అభివృద్ధే ఏకైక మంత్రంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు దూకుడు పెంచారు. బుధవారం ఆలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వంగపల్లిలోని దుర్గామాత దేవాలయంలో పూజలు చేసి ప్రజల్లోకి వెళ్లారు. నాలుగేండ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరోసారి ఆశీర్వదించాలని వేడుకున్నారు. అనంతరం మోటకొండూరు మండలం కాటేపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీతో పాటు.. ఆత్మకూరు (ఎం) మండలం పుల్లాయిగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. మరోవైపు మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చౌటుప్పల్ నుంచి ప్రచారం ప్రారంభించారు. మునుగోడు వరకు ఆరు వేల బైక్‌లతో భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నా రు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

ఆలేరుకు ప్రతి గ్రామానికి గోదావరి జలాలు తీసుకువస్తాం.. సీఆర్ రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తి.. తెలంగాణ ప్రాంతానికి గోదావరి, కృష్ణా జలాలు ఏలా తీసుకురావాలో తెలిసిన మహా మేధావి.. కారు గుర్తుకే ఓటేయండి.. టీఆర్‌ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి రావాలి అంటూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మొదటి రోజు ప్రచారం ఉత్సాహంగా సాగింది. బుధవారం ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట మండలంలోని తమ స్వగ్రామం వంగపల్లిలో గ్రామ దేవత దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి తమన మరోసారి దీవించాలని కోరారు. ఇంట్లో కూరగాయాల కోస్తున్న వృద్ధురాలు.. కల్లు విక్రయిస్తున్న గౌడ్‌న్నల వద్ద వెళ్లి టీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధిని వివరించారు. గీత కార్మికుడి వద్దకు వెళ్లి కల్లును విక్రయించి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గడిచిన నాలుగేండ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, 102 వాహనం వంటి పథకాలతో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో డీఎల్‌డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, జడ్పీటీసీ కర్రె కమలమ్మ, మదర్ డెయిరీ డైరక్టర్ కళ్లెపల్లి శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ రేపాక స్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు బుగ్గ శ్రీనివాస్, బుషిగంపల నగేశ్, యువజన విభాగం మండలాధ్యక్షుడు ఎండీ అజ్జు, దయ్యాల భరత్, కానుగంటి లక్ష్మణ్, కానుగు రాజీవ్, ఎడపెల్లి మహేశ్, ఆరె యాదగిరి, నువ్వుల రమేశ్, కసావు శ్రీనివాస్, చిత్తర్ల బాలయ్య, గొపగాని ప్రసాద్, గణగంటి బాబురావు, శరాజీ సంతోశ్, మిట్ట అనిల్, బుగ్గ మహేశ్, బండి మహేశ్, జెట్ట నరేశ్, అనిల్, అబీబ్ పాల్గొన్నారు.

బైక్‌ల భారీ ర్యాలీ..
మోటకొండూర్: ఎన్నికల ప్రచారం ప్రారంభం నేపథ్యంలో టీఆర్‌ఎస్ మోటకొండూర్ మండల కమిటీ, యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం 200 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వంగపల్లి నుంచి ఆత్మకూరు(ఎం) పుల్లాయి గూడేనికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, డీఎల్‌డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ ఐలయ్య, ఎంపీటీసీ పర్వతాలు, నర్సింగ్ యాదవ్, యూత్ విభాగం నాయకులు మల్కయ్య, అశోక్, పరమేశ్, వెంకటేశ్, బురాన్, శ్రీనివాస్, కాటేపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు కొమురయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మి నాగిరెడ్డి, సోములు, వెంకటేశ్, నర్సిరెడ్డి, కరుణాకర్, లక్ష్మయ్య, బాల్‌రెడ్డి, గణేశ్, రమేశ్, మల్లేశ్, నాగరాజు, అశోక్, రమేశ్, రవి, నర్సింహ, శ్రీను, స్వామి, పాండు, పవన్ కుమార్, నవీన్, శ్రీనివాస్, వెంకటేశ్, గుర్రాల కిష్టయ్య, రేపాక వెంకన్న పాల్గొన్నారు.

పుల్లాయిగూడెంలో..
ఆత్మకూరు(ఎం) మండలంలోని పుల్లాయిగూడెంలో అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు గ్రామంలోని బొడ్రాయికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్ అన్నివర్గాలకు సంక్షేమానికి పాటుపడిందన్నారు.

పోరాటాల గడ్డ పుల్లాయిగూడెం
పోరాటాల పురటిగడ్డ పుల్లాయిగూడెం అని, ఇక్కడి నుంచి ప్రచార సభ ప్రారంభించడం గొంగిడి సునీతారెడ్డి గెలుపునకు నాంది అని టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. పుల్లాయిగూడెంలోని 600 మంది ఓటర్లు ఇచ్చిన మాటకు కట్టుబడి కారు గుర్తుకు ఓటు వేసి గొంగిడి సునీతను అసెంబ్లీకి పంపాలని కోరారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...