మత్స్యగిరి క్షేత్రం మహిమాన్వితం


Wed,September 12, 2018 11:22 PM

వలిగొండ: మత్స్యగిరి క్షేత్రం మహిమాన్వితం కలదని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం వెంకటాపూరంలో మత్స్యగిరిగుట్ట నూతన చైర్మన్ పాలక వర్గం ప్రమాణస్వీకారం చేశారు. అభినందన సభలో వారు మాట్లాడుతూ మత్స్యగిరి క్షేత్రం దేశంలోనే ఒక అరుదైన క్షేత్రమన్నారు. స్వామి వారు ఇక్కడ స్వయంభుగా వెలియడంతో ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. ప్రభుత్వం గత చైర్మన్‌ల కృషితో కొండ పై ఎన్నో సౌకర్యాలు సమకూరాయన్నారు. తాజా చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి తమ పాలకవర్గంతో గుట్ట మరింత అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. ఆలయ అభివృద్ధికి ప్ర భుత్వం మరిన్ని నిధులు ఇస్తుందన్నారు. మత్స్యగిరి గుట్ట ప్రాముఖ్యతను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నూతన చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి స్వామి వారి గర్భగుడి నిర్మించేందుకు రూ.50 లక్షలు మంజూరు చేశారన్నారు. పార్టీలకతీతంగా సమన్వయంతో పని చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర్‌రెడ్డి తనకు బంధువని మత్స్యగిరిగుట్ట ప్రాముఖ్యతను తాను తెలుసుకున్నానన్నారు. దేవస్థానం అభివృద్ధికి తాను రూ.లక్ష విరాళం అందజేస్తానని తెలిపారు. మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ మత్స్యగిరిగుట్ట టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. అర్చకులు, సిబ్బంది ఎమ్మెల్సీ , మాజీ ఎమ్మెల్యే లకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మి,

ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి పాలకవర్గంలోని చైర్మన్‌లుగా కేసిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులుగా సురకంటి లకా్ష్మరెడ్డి, చంద్రయ్య, తుమ్మల దామోదర్, శ్యామల సుదర్శన్‌రెడ్డి, మద్దెల ధనంజయ్య, ఓరుగంటి స్వామి, పబ్బు స్వామి, కాసుల పెద్దులు, అంబటి మోహన్, జట్టి నరేశ్, బుంగమట్ల సుధాకర్, తక్కెళ్ల పద్మ, కల్లెం బాలశంకర్, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ప్రతాపురం శ్రీనివాసాచార్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. అభినందన సభలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డిని ఆయా గ్రామాల ప్రజలు, టీఆర్‌ఎస్ నాయకులు, అభిమానులు శాలువా కప్పి ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, వంగాల వెంకన్నగౌడ్, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పబ్బు ఉపేందర్‌బోస్, తుమ్మల యుగేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చిత్తడి జనార్ధర్‌రెడ్డి, వేముల ఎంపీటీసీ కాడిగల్ల సునీతాపరుశురాములు, మదర్ డెయిరీ డైరెక్టర్ గూడూరి శ్రీధర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు వాకిటి అనంతరెడ్డి, మండల కో ఆర్డినేటర్ మమత, గూడూరి శివశాంత్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సురకంటి వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బద్దం భాస్కర్‌రెడ్డి, ఐటి పాముల సత్యనారాయణ, కాసుల కృష్ణ, రేకల బాలరాజు, ఎండీ జహంగీర్, డేగల పాండరి, ప్రభాకర్, నర్సోజి, శేఖర్ పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...