100 స్థానాలు ఖాయం


Wed,September 12, 2018 12:14 AM

-చేసిన అభివృద్ధే గెలిపిస్తుందన్న విశ్వాసం ఉంది
-ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పేందుకే ముందస్తు ఎన్నికలు
-తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్
-ఆలేరు, భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
-రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్

భువనగిరి టౌన్ : రాబోయే ఎన్నికల్లో 100 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం భువనగిరిలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు యాదగిరిగుట్టలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సన్నాహాక సభలో ఆయనపాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతూ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని కుట్ర పన్నుతున్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పేందుకే ముందస్తుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ నాలుగున్నర ఏండ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేసి ఆలేరు, భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 అసెంబ్లీ స్థానాలు ఖాయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ జోస్యం చేశారు. పట్టణంలోని ఓ హోటల్‌లో మంగళవారం జరిగిన భువనగిరి నియోజకవర్గ టీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కుట్ర పన్నిన ప్రతిపక్షాలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమన్న ప్రతిపక్షాలకు ఈ నిర్ణయంతో కళ్లు బైర్లు కమ్మి అపవిత్ర పొత్తుల కోసం సిద్ధమవుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో ప్రభుత్వ పథకాలు ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలకే దక్కేవన్నారు.

స్వపరిపాలనలో అందుకు భిన్నంగా ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయన్నారు. నియోజవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన పైళ్ల శేఖర్‌రెడ్డిని కార్యకర్తలు, నాయకులు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ కొల్పుల అమరేందర్, భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ నువ్వుల ప్రసన్న, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎలిమినేటి సందీప్‌రెడ్డి, చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, శెట్టి బాలయ్యయాదవ్, గోళి పింగల్‌రెడ్డి, భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ ఎంపీపీలు తోటకూరి వెంకటేష్‌యాదవ్, గోళి ప్రణీతాపింగల్‌రెడ్డి, సార సరస్వతి, శ్రీరాముల నాగరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు సిద్దుల పద్మ, భువనగిరి, చందుపట్ల పీఎసీఎస్ చైర్మన్లు ఎడ్ల సత్తిరెడ్డి, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గోమారి సుధాకర్‌రెడ్డి, సుబ్బూరు బీరుమల్లయ్య, నక్కల చిరంజీవియాదవ్, చిందం మల్లికార్జున్ పాల్గొన్నారు.

సునీతారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి

మోటకొండూర్(యాదగిరిగుట్ట టౌన్): ఆలేరు నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బడుగుల లింగయ్య యాదవ్ కోరారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌డ్డి,టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సన్నాహక సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు ఓటరు సవరణ కార్యక్రమం ఉంటుందన్నారు.

బడుగు బలహీన వర్గాల అభ్యన్నతికి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించి చూపిస్తామని తెలిపారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యువజన విభాగం నియోజక వర్గ కన్వీనర్ గడ్డమీది రవీందర్ గౌడ్, అధికార ప్రతినిధి చిత్తర్ల బాలయ్య, గొపగాని ప్రసాద్, పాండవుల భాస్కర్, శారాజీ రాజేష్, మిట్ట అనిల్, కాంటేకర్ పవన్, వంగపల్లి అరుణ్, ఎండీ అజ్జు, శ్రీకాంత్, కాసావు శ్రీనివాస్ గౌడ్, వివిధ మండలాల అధ్యక్షులు గూదె బాలనర్సయ్య, దూదిపాల రవీందర్‌రెడ్డి, ఆకవరం మోహన్‌రావు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...