నేడు ఆశీర్వాదం కోసం ప్రజల్లోకి


Wed,September 12, 2018 12:10 AM

-మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి
మోటకొండూర్(యాదగిరిగుట్ట టౌన్): ఆలేరు ప్రజల ఆశీర్వాదం కోసం నేడు ప్రజల్లోకి వెళ్తున్నామని, 60 వేల మెజార్టీతో గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు. బుధవారం ఉదయం 9 గంటలకు వంగపల్లిలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మోటకొండూర్ మండలం కాటేపల్లిలో 200 బైక్‌లతో ర్యాలీ నిర్వహించి ఆత్మకూరు(ఎం) పుల్లాయిగూడెంలో సభ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆలేరు ప్రజలపై పూర్తి విశ్వా సం ఉందన్నారు. అందరి సలహాలు తీసుకుని ప్రచార రూట్ మ్యాప్ తయారు చేసుకున్నామన్నారు. 25వ తేదీ వరకు టీఆర్‌ఎస్ కొత్త ఓటరు నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే , ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు స్వచ్ఛందంగా కోరుతున్నారని పేర్కొన్నారు. పవర్ ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్‌లు పూర్తి స్థాయిలో నిర్మాణం కావాలంటే అది కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు.

తెలంగాణ రైతాంగానికి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా లక్ష్యమన్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో ఉన్న కొండ పోచమ్మ ప్రాజెక్ట్ నుంచి బ్రాంచ్ కెనాల్ ద్వారా శామీర్‌పేట వాగు నుంచి నియోజక వర్గంలో తుర్కపల్లి మండలంలోని 45 చెరువులు, బొమ్మల రామారంలోని 23 చెరువుల్లోకి నీళ్లు వస్తాయన్నారు. దీంతో తుర్కపల్లి, బొమ్మల రామారం మండలాల్లో ఐదు వేల ఎకరాల ఆయకట్టు సాగుకు వస్తుందని తెలిపారు. ఆశ్వరావ్ పల్లి ప్రాజెక్టు కాల్వ జనగాం జిల్లాలోని పెంబర్తి నుంచి ఆలేరు మండలంలోని టంగుటూరు ద్వారా 15 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. ఈ ఆశ్వరావ్ పల్లి ప్రాజెక్టు ద్వారా ఆలేరు మండలంలోని 20 చెరువులు, ఆత్మకూరు(ఎం) మండలంలోని మూడు చెరువులకు సమృద్ధిగా నీళ్లు వస్తాయన్నారు. బొమ్మకూరు, ఆశ్వరావుపల్లి కాల్వల ద్వారా బీమగాని కాల్వకు నీళ్లు చేరుతాయన్నారు. తద్వారా అదనంగా 3 వేల ఎకరాలకు సాగు నీళ్లు వస్తాయని తెలిపారు.

ఆలేరు నియోజక వర్గంలో ప్రతి మండలంలోని చెరువుల్లోకి నీళ్లు అందే సౌలభ్యం ఉందని, ఇందుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలిపించుకోవడంతో పాటు ఆలేరులో తమను ప్రజలు మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఓట్లు వేస్తే ఆలేరు ఎడారిగానే మిగిలిపోతుందని తెలిపారు. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిలిచిపోతాయన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యువజన విభాగం నియోజక వర్గ కన్వీనర్ గడ్డమీది రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరి, పట్టణ శాఖ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, మాజీ సర్పంచ్ బూడిద స్వామి, ఎంపీటీసీ సీస కృష్ణ, నువ్వుల రమేశ్, బిట్టుకుమార్, గోపగాని ప్రసాద్, మిట్ట అనిల్ పాల్గొన్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...