గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి గెలుపు ఆపలేరు


Wed,September 12, 2018 12:10 AM

రాజాపేట : రాబోయే ఎన్నికల్లో హరిహర బ్రహ్మాదులు అడ్డుపడిన ఆలేరులో గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మరో సారి గెలుపును ఆపలేరని టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆలేరులో చేసిన ఏనలేని అభివృద్ధే టీఆర్‌ఎస్ అభ్యర్తి గెలుపునకు నాంది పలుకుతుందన్నారు. ఈసారి ఆలేరులో సునీతామహేందర్‌రెడ్డి 60 వేల మేజార్టీతో గెలుపొందుతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. మరో ఇరువై ఏండ్లు టీఆర్‌ఎస్ అధికారంలో ఉండటం ఖాయమన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేస్తే రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్‌గౌడ్, మదర్ డెయిరీ డైరెక్టర్ చింతలపూరి వెంకట్‌రాంరెడ్డి, ఆలేరు మార్కెట్ డైరెక్టర్లు గుర్రం నర్సింహులు, బోళ్ల రాఘవరెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు దాచపల్లి శ్రీనివాస్, రేగు సిద్ధులు, మన్నె రాములు తదితరులు ఉన్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...