నేడు మట్టి విగ్రహాల పంపిణీ


Wed,September 12, 2018 12:10 AM

ఆలేరుటౌన్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా బుధవారం వినాయకుని మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రకృతిని పరిరక్షించుకోవాలన్నారు. అందుకోసమే రంగులు, రసాయనాలు లేని శ్రేష్టమైన మట్టి వినాయక విగ్రహాలను పూజించాలన్నారు. దీనిలో భాగంగానే పాఠశాల విద్యార్థులకు మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శేఖర్, హరినాథ్ రెడ్డి, మంద సోమరాజు, పరిగె రాములు, యోగేశ్వరరావు, నవీన్, మురళి, సాంబశివ, వేణు, శ్యామసుందరి, లక్ష్మమ్మ, రుక్మిణి, కవిత, స్వర్ణలత, విజయలక్ష్మి, మీరా, ఎన్‌సీసీ అధికారి దూడల వెంకటేశ్ పాల్గొన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...