ఖాతాదారులకు మెరుగైన సేవలు


Wed,September 12, 2018 12:09 AM

భువనగిరి ఖిల్లా : ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించడమే బ్యాంకు ధ్యేయమని శ్రీ యాదగిరి లక్ష్మీ నర్సింహస్వామి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ జైని రమేశ్, మేనేజింగ్ డైరెక్టర్ చెన్న వెంకటేశం అన్నారు. పట్టణంలోని శ్రీ యాదగిరి లక్ష్మీ నర్సింహస్వామి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలకవర్గ సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం వివిధ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు అందించే సేవలను గుర్తించి ఇచ్చే జాతీయ అవార్డుల్లో 2017-18 ఆర్థిక సంవత్సరానికి బెస్ట్ ఏటీఎం ఎక్స్‌పన్షన్-2018 అవార్డు బ్యాంకుకు వచ్చిందన్నారు. ఈ నెల 8న ఢిల్లీలో జరిగిన జాతీయ కో ఆపరేటీవ్ సమ్మేళనంలో ఈ అవార్డును అందుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ అందె శంకర్, పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్‌గుప్తా, వెంకట్‌రెడ్డి, సుధాకర్, బచ్చు నాగేందర్, సీహెచ్ రఘుబాబు, నవీన్‌కుమార్, సోమ రాజిరెడ్డి, కొల్పుల వివేకానంద, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...