మొక్కులను నాటి సంరక్షించాలి


Wed,September 12, 2018 12:09 AM

మోటకొండూర్(యాదగిరిగుట్టరూరల్) : గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటి సంరక్షించాలని ఎంపీపీ గడ్డమీది స్వప్నారవీందర్ గౌడ్, యాదగిరిగుట్ట ఎంపీడీవో, వంగపల్లి గ్రామ ప్రత్యేకాధికారి మంగళంపల్లి సాంబశివరావు అన్నారు. మంగళవారం మండలంలోని వంగపల్లిలో హరితహారంలో భాగంగా రైల్వే ట్రాక్ పక్కన సుమారు వెయ్యి మొక్కలను నాటి, నీళ్లు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలను నాటాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కానుగు కవితాబాలరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ అనిత, గ్రామస్తులు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...