తెలంగాణ సాహిత్యం గొప్పది


Wed,September 12, 2018 12:09 AM

ఆలేరుటౌన్ : దేశంలోని అన్ని సాహిత్యాల కంటే కూడా తెలంగాణ సాహిత్యం చాలా గొప్పదని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. సత్యనారాయణ అన్నారు. తెలంగాణ భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాహిత్యాన్ని కించపరిచే విధంగా ప్రసారమాధ్యమాల్లో వస్తున్నాయన్నారు. సినిమాల్లో వ్యంగ్యంగా చూపిస్తున్నారని, ఇది సరికాదన్నారు. మన రాష్ట్రం, మన భాష చాలా గొప్పదన్నారు. కళాశాల తెలుగు విభాగం సహయక ఆచార్యులు డా.ఎన్. నిశ్చల స్వాగతోపన్యాసం చేయగా, పలువురు విద్యార్థులు తెలంగాణపై కవితలు చెప్పారు. సెమినార్‌లో అధ్యాపకులు డా. రజని, డా. వెంకటేశ్, డా.హరిత, చిత్ర, మధవి తదితరులు పాల్గొన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...