ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి


Wed,September 12, 2018 12:09 AM

భువనగిరిరూరల్ : గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. శాంతి సంఘ సభ్యులు జిల్లా యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ నెల 13న వినాయకచవితి పండుగ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ రమేశ్‌తో కలిసి కలెక్టర్ శాంతి సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలన్నారు. వదంతులు నమ్మకుండా వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. 16వ తేదీన వీఆర్‌వో పరీక్షలు , 17న ఈవీఎంలు జిల్లాకు రానున్నాయన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ ఉత్సవాలు విజయవంతం కావటానికి శాంతి సంఘం సభ్యుల సహకారం ఎంతో అవసరమన్నారు. నిమజ్జన సమయంలో ప్రతి విగ్రహం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు సమయపాలన పాటించాలని సూచించారు. ఏసీపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ గణేశ్ నవరాత్రుల్లో డీజే సౌండ్స్‌ను నిషేధించినట్లు తెలిపారు. మండపాల వద్ద బాధ్యులైన వారు విధిగా ఉండాలని క్రమం తప్పక పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అనుమానిత వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో డీఆర్‌వో విజయకుమారి, ఆర్డీవోలు భూపాల్‌రెడ్డి, సూరజ్‌కుమార్, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, ఐబీ ఈఈ రాంచందర్, ట్రాన్స్‌కో ఎస్సీ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ బాబురెడ్డి, సీఐలు, శాంతిసంఘ సభ్యులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...