93 కోట్ల మొక్కల నాటాం


Wed,September 12, 2018 12:09 AM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ: హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 93కోట్ల మొక్కలు నాటామని పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) పీకే జా తెలిపారు. చౌటుప్పల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్మృతి వనాన్ని కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఫారెస్ట్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరుల జ్ఞాపకార్థం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కారణాలతో చనిపోయిన వారి పేర్ల మీద రూ. 5వేలు చెల్లించి మొక్కలు నాటవచ్చన్నారు. ఈ ఏడాది 40కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదిలోపు 100 కోట్ల మొక్కలు నాటుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24శాతం అటవీవిస్తీర్ణం ఉందని తెలిపారు. అడువుల సంరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం హరితహారంలో చురుగ్గా పాల్గొన్న పలువురు అధికారులకు ప్రశాంసా పత్రాలను అందజేశారు.

హరిత యాదాద్రిగా మార్చేందుకు చర్యలు
జిల్లాను హరితయాదాద్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అనితారమచంద్రన్ తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటామన్నారు. ఈ ఏడాది 1.6 కోట్ల మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల్లో మొక్కల నాటే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయనున్నామన్నారు. తద్వారా ఆయా గ్రామాల్లోనే అందుబాటులో ఉన్న నర్సరీల నుంచి పెద్ద ఎత్తున మొక్కలు తీసుకుని నాటేందుకు వీలుంటుందన్నారు. . ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ పీసీఎఫ్ (ఐటీ, పబ్లిసిటీ) పి రఘువీర్, పీసీసీఎఫ్(పీఆర్‌వోడీ) ఎం పృథ్వీరాజ్, ఏపీసీసీఎఫ్ లుఆర్ శోభ, మునీంద్ర, ఎం డోబ్రియల్, లోకేష్ జశ్వాల్, స్వర్గం శ్రీనివాస్, అడిషనల్ పీసీసీఎఫ్ జి చంద్రశేఖర్‌రెడ్డి , డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజర్లు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...