ఎన్నికల నిర్వహణకు సహకరించాలి


Tue,September 11, 2018 12:10 AM

-కలెక్టర్ అనితారామచంద్రన్
ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 15న బెంగళూరు నుంచి జిల్లాకు ఈవీఎంలు రానున్నట్లు తెలిపారు. ఓటర్ల తుది జాబితా పరిశీలన అనంతరం ఫొటో ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలకు అందజేస్తామన్నారు. ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారిని గుర్తించి నమోదుకు కృషిచేయాలన్నారు. 15,16 తేదీల్లో బూత్ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే మార్గదర్శకాలు వివరిస్తామన్నారు.

భువనగిరిరూరల్: సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి అనితారామచంద్రన్ కోరారు. 2018 జనవరి 1నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15న బెంగుళూరు నుంచి జిల్లాకు ఈవీఎంలు రానున్నట్లు చెప్పారు. ఈ మేరకు అధికారుల బృందాన్ని బెంగుళూరు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. దిగుమతి కానున్న ఈవీఎంలను మార్కెట్ కమిటీ గోదాంల్లో భద్రపరుస్తామన్నారు. భద్రపరిచే సమయంలో ఈవీఎంలను పరిశీలించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారిని గుర్తించి నమోదుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ రామచంద్రారెడ్డి, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవోలు భూపాల్‌రెడ్డి, సూరజ్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బట్టు రామచంద్రయ్య, భువనగిరి శ్రీనివాస్‌నేత, చింతల కిష్టయ్య, పల్లెర్ల అంజయ్య, అశోక్, లక్ష్మయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాగేశ్వరచారి, గిరిధర్ సురేశ్ పాల్గొన్నారు.

ఆదేశాలను తప్పక పాటించాలి..
ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో సోమవారం సమావేశమై మార్గదర్శకాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో వచ్చిన ైక్లెయిమ్‌లు, ఆక్షేపనులు పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన పోలింగ్ కేంద్రాలకు వెంటనే బీఎల్‌వోలను నియమించాలని, పోలింగ్ కేంద్రాలన్నింటిలో దివ్యాంగ ఓటర్ల సౌకర్యార్థ్ధం ర్యాంపులు వెంటనే నిర్మించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 15,16 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టి గ్రామ సభల్లో ఓటర్ల జాబితా చదివి వినిపించాలని కోరారు. ైక్లెయిమ్‌లు, ఆక్షేపణలను పరిశీలించి అక్టోబర్ 8న తుది జాబితాలు ప్రచురించాలన్నారు.

ఈ మేరకు ఆలేరు నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, స్థానిక తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, ఏఈఆర్‌వోగాను, భువనగిరి నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఆర్‌డీవో భూపాల్‌రెడ్డి, ఏఈఆర్‌వోగా స్థానిక తహసీల్దార్ వెంకట్‌రెడ్డిని నియమించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ అనంతరం భువనగిరి నియోజకవర్గంలో 249, ఆలేరు నియోజకవర్గంలో 303 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమారి, ఆలేరు రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి, భువనగిరి రిటర్నింగ్ అధికారి భూపాల్‌రెడ్డి, ఏఈఆర్‌వోలు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాగేశ్వరచారి, ఎన్నికల సెక్షన్‌లు, పర్యవేక్షకులు గిరిధర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...