పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ


Tue,September 11, 2018 12:09 AM

మోటకొండూర్ : పేదల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రేగు అశోక్, ఆత్మ జిల్లా డైరెక్టర్ భూమండ్ల సుధీర్ అన్నారు. సోమవారం మోటకొండూర్ పట్టణానికి చెందిన బుగ్గ కృష్ణమూర్తికి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.33.50 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి టీఆర్‌ఎస్ అండగా ఉన్నదన్నారు. మోటకొండూర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. మరో సారి సీఎంగా కేసీఆర్, ఆలేరు ఎమ్మెల్యేగా గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మండలాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుగ్గ శ్రీనివాస్, బుగ్గ బాలరాజు, మాజీ ఉప సర్పంచ్ బొట్ల నర్సింహా, కంకల బీరయ్య, వంగాల స్వామి, బుగ్గ భాస్కర్, బుగ్గ సత్తయ్య, నర్సింహా, బుగ్గ పవన్, బుగ్గ శ్రీశైలం, రామిడి విఠల్‌రెడ్డి, వస్పరి మల్లేశ్, పడిగే రాములు, ముత్యాల తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ..
ఆత్మకూరు(ఎం) : సీఎం సహాయనిధి నుంచి మండల కేంద్రానికి చెందిన కోల రవికి మంజూరైన రూ.11వేల చెక్కును ఆదివారం మండల కేంద్రంలో ఎంపీపీ కాంబోజు భాగ్యశ్రీభానుప్రకాశ్ అందజేశారు. ఆమె వెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, జిల్లా, మండల నాయకులు ఇంద్రారెడ్డి, భిక్షపతి, భానుప్రకాశ్, చందర్‌గౌడ్, కవిత, రంగారెడ్డి, ఉదయ్, సత్తయ్య, మల్లికార్జున్, పరశురాములు తదితరులు ఉన్నారు.

బొమ్మలరామారం : సీఎం సహాయనిధి పేదలకు ఆర్థిక అండగా నిలిచిందని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గూదె బాల్‌నర్సింహ, సీనియర్ నాయకుడు మర్రి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన రాసాల మంగమ్మకు సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరైన రూ.16వేల చెక్కును ఆమె కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలిచిందన్నారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. చెక్కు మంజూరుకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలోటీఆర్‌ఎస్ నాయకులు కుశంగల సత్యనారాయణ, ఎల్లబోయిన గోపాల్, శాంతాచారి, కృష్ణాచారి, నరేశ్, నాగులు, నర్సింహ ఉన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...