యాదగిరిగుట్టకు చేరుకున్న పాదయాత్ర


Tue,September 11, 2018 12:09 AM

మోటకొండూర్(యాదగిరిగుట్ట పట్టణం) : ఆలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరుతూ ఆత్మకూరు(ఎం) టీఆర్‌ఎస్వీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆత్మకూరు(ఎం)నుంచి చేపట్టిన పాదయాత్ర యాదగిరిగుట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి, ఆత్మకూరు(ఎం) టీఆర్‌ఎస్వీ మండల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు పూర్తై రైతులకు సాగు నీరు అందాలంటే కేసీఆరే మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దేలా కేసీఆర్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు భేష్‌గా ఉన్నాయన్నారు. ఆలేరు నియోజకవర్గం కోనసీమగా మారాలంటే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవారన్నారు. గంధమల్లతో సంబంధం లేకుండా కాళేశ్వరం బ్రాంచ్ కెనాల్, మల్లన్నసాగర్ కాల్వల ద్వారా 8మండలాలకు సాగు నీటి లభ్యత ఉందని, ఈ విషయం గమనించి ఆ దిశగా ప్రయత్నాలు సాగించి సఫలమయ్యారన్నారు. యాదగిరిగుట్టకు వచ్చిన పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీఆర్‌ఎస్ ప్రభుతం పాలన కొనసాగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పే మనిషి కాదని,

ఆయన స్ఫూర్త్తితోనే ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గానికి సాగు నీరు అందిచాలన్నదే తమ అభిమతమన్నారు. మరో 20ఏండ్లపాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగడం ఖాయమన్నారు. ర్యాలీలో ఆత్మకూరు(ఎం)టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు చుంచు నాగరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సామ నరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు సాయిబాబు, మల్లికార్జున్‌గౌడ్, మహేష్, రాజు, హైమద్, మధు, నవీన్ పాల్గొనగా, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, టీఆర్‌ఎస్ యూత్ విభాగం నియోజకవర్గ కన్వీనర్ గడ్డమీది రవీందర్‌గౌడ్, టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు గొపగాని ప్రసాద్, పట్టణాధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, యూత్ అధ్యక్షుడు ఎండీ అజ్జూ, టీఆర్‌ఎస్వీ ఆలేరు నియోజక వర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి దయ్యాల భరత్ తదితరులు పాల్గొన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...