నేడు టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో పాదయాత్ర


Sun,September 9, 2018 11:40 PM

ఆత్మకూరు(ఎం) : ఆలేరు ఎమ్మెల్యేగా గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ సోమవారం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఆత్మకూరు(ఎం) నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేయనున్నట్లు టీఆర్‌ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు చుంచునాగరాజు, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు సామ నరేందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శులు బండసాయిబాబు, నాతి మల్లికార్జున్‌గౌడ్, మండల నాయకులు బెజ్జెరబోయిన మహేశ్, యాస రాజు, హైమద్, వినోద్, మధు, మహ్మద్, నరేశ్, హసీఫ్, నాగరాజు, హరీశ్, సాయికిరణ్ పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...