టీఆర్‌ఎస్ కు ఆదరణ పెరుగుతున్నది


Sun,September 9, 2018 11:40 PM

మోటకొండూర్ : టీఆర్‌ఎస్ పార్టీకి రోజుకింత ఆదరణ పెరుగుతున్నదని, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన సీపీఎం నాయకులు కొల్లూరి శ్రీహరి ఆధ్వర్యంలో కొల్లూరి నర్సింహతో పాటు పలువురు కార్యకర్తలు ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆలేరులో చేస్తున్న అభివృద్దిని చూసి ప్రజలకు టీఆర్‌ఎస్ పార్టీ పై నమ్మకం పెరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమన్నారు. ఆలేరుకు సాగు నీళ్లు తీసుకురావడమే మా లక్ష్యంగా పనిచేస్తామని, ఇందుకు ప్రతి ఒక్కరి దీవించాలని కోరారు. పార్టీలోకి చేరేవారికి సముచి స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆరెగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు గాజుల మల్లేశ్, యూత్ విభాగం అధ్యక్షుడు మారబోయిన చిరంజీవి, యూత్ ప్రధాన కార్యదర్శి కొల్లూరి శ్రీహరి, మారెబోయిన అశోక్, నాయకులు ఎల్లేశ్, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సిరబోయిన నర్సింగ్‌యాదవ్ పాల్గొన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...