నేడు చాకలి అయిలమ్మ వర్ధంతి


Sun,September 9, 2018 11:40 PM

ఆత్మకూర్(ఎం) : భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకరి వియుక్తికోసం జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుభాగాన నిలబడి పోరాడిన వీరనారి చాకలి అయిలమ్మ ఆనాడు నిజాం నవాబు, జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చి తన కుటుంబాన్ని సైతం పోరుబాటలో నడిపించిన వీరవనిత అయిలమ్మ. 1919లో జనగామ తాలుకా కిష్టాపురం (ఒకప్పటి నల్లగొండ జిల్లాలో) పుట్టిన చాకలి అయిలమ్మకు 13వ ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సింహతో వివాహమయింది. దొర చెప్పిందే చట్టం, చేసిందే శాసనంగా నడుస్తున్న రోజులవి ఆరోజుల్లో రాక్షస రజాకార్ల నిజాం సంస్థానం పరిరక్షణకోసం కాశీం రిజ్వీ ఏర్పాటు చేసిన సైన్యాన్ని, విసునూరు దేశ్‌ముఖ్ రాపాక చంద్రారెడ్డి ఆగడాలను ఎదిరించిన ధీరవనిత అయిలమ్మ పోరాట స్ఫూర్తి ప్రతి తెలంగాణ బిడ్డకు ఆదర్శప్రాయం.

అయిలమ్మ వరి పంటను దోచుకునే విసునూరు దొర ప్రయత్నాన్ని అలనాటి కమ్యూనిస్టుపార్టీ నాయకులైన ఆరుట్ల రామచంద్రా రెడ్డి, భీమి రెడ్డి నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో అణచి వేశారు. అయిలమ్మ సాగించిన పోరాటం పల్లెపల్లెకు పాకి ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఈ క్రమంలో అనేక భూపోరాటాలు హైదరాబాద్ సంస్థానంలో వ్యాపించాయి. ఇదే సమయంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డికొమరయ్య కడవెండిలో రజాకార్లతూటాలకు బలయ్యాయి. ఈ ఘటన తెలంగాణ పోరాటాన్ని సాయుధపోరాటంగా మలుపు తిప్పింది. తొలుత అయిలమ్మ తెగింపుతో దొరల ఆగడాలను ఎదిరించడం అందరికి స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ తొలివీరనారి చాకలి అయిలమ్మ జీవిత పోరాటం జనం గుండెల్లో మండుతన్న అగ్నికణం ఆమె నేర్పిన పోరాటం నేటి తరాలకు ఆదర్శం కావాలి.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...