అయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు


Sun,September 9, 2018 11:39 PM

చౌటుప్పల్ రూరల్ : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఎమ్మెల్యే టిక్కెట్ అధిష్టానం తమకే కేటాయిస్తుందని పలువురు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గం ఇంచార్జీ పాల్వాయి స్రవంతి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారబోయిన రవి, మరో రాష్ట్ర నాయకుడు పున్న కైలాస్‌నేతలు టికెట్ తమకే ఇస్తారని ఒక వైవు ప్రచారాలు సాగిస్తున్నారు. మండలకేంద్రంంలో ఎవరికి వారే ఇంతకుముందు ప్రచారం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. మరో వైవు డీసీసీబీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏసీరెడ్డి దయాకర్‌రెడ్డి తనకు టికెట్ కేటాయించాలని ఆధిష్టానానికి దరఖాస్తు చేస్తుకున్నాని ప్రచారం సాగిస్తున్నాడు. 2004 ,2009 ఎన్నికల బరిలో దిగితే అప్పటి సీఎం వైస్ రాజశేఖర్‌రెడ్డి పిలుపు మేరకు తప్పుకున్నాని చెబుతున్నారు.

వీరందరి ప్రకటనలతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఎవరికి వారే ప్రచారాలు సాగించడంతో కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఆశావహులు మాత్రం తన దగ్గరి అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమకే అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని మద్దతివ్వాలని కోరుతున్నారు. మరికొంతమంది అభ్యర్థులు గ్రామాల్లోని ముఖ్యనాయకులను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు పెద్ద ఎత్తున పెరిగి టీఆర్‌ఎస్‌కి మరింత లబ్ధి చేకూరనున్నది. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు అత్యధిక మెజార్టీతో ముందుకు దూసుకుపోనున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు కూడా పెరుగనున్నాయి. ఇప్పటికే కొంతమంది నాయకులు టీఆర్‌ఎస్‌లోకి రావడానికి సిద్ధమైనట్లు సమచారం.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...