భక్తజనంతో పోటెత్తిన యాదాద్రి


Sun,September 9, 2018 11:39 PM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల పోట్టెత్తారు. శ్రావణ మాసం చివరి ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో క్యూలైన్లు, తిరువీధులన్నీ కిటకిటలాడాయి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్ల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణం, సుదర్శనహోమం కైంకర్యాలతో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ వారి దర్శనానికి నాలుగు గంటల, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు పడుతున్నదని భక్తులు చెబుతున్నారు. రద్దీ పెరగడంతో పోలీసులు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలయ్యాయి. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు కొనసాగాయి.

వైభవంగా వ్రత పూజలు..
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. శ్రీ సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
గోశాలలో మహాలక్ష్మి యాగం..
అమవాస్య పురస్కరించుకుని యాదగిరిగుట్ట గోశాలలో మహాలక్ష్మి యాగం ఘనంగా జరిగాయి. 108 సువర్ణ పుష్పాలతో గోమాతకు అర్చన మరియు అన్నదానం వైభవంగా నిర్వహించారు.
శ్రీవారి ఖజానా లెక్కింపు ..
శ్రీవారి ఖజానాకు రూ. 29,85,860 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 1, 63,428, 100 రూపాయల టికెట్‌తో రూ. 40,000 , 150 రూపాయల టికెట్‌తో రూ. 8,62,650 కల్యాణ కట్ట ద్వారా రూ. 80,000, వ్రత పూజల ద్వారా రూ. 1,65,000, ప్రసాద విక్రయాలతో రూ. 11,72,883, గదుల విచారణ శాఖ ద్వారా రూ. 76,910, శాశ్వత పూజల ద్వారా రూ. 39,348 తో పాటు మిగతా విభాగాల నుంచి శ్రీవారి ఖజానాకు ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...