రాజీయే రాజమార్గం


Sun,September 9, 2018 12:06 AM

భువనగిరి టౌన్ : రాజీయే రాజమార్గమని ఐదవ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి మురళీమోహన్‌రెడ్డి అన్నారు. మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని భువనగిరి సబ్‌కోర్టులో నిర్వహించిన మెగా లోక్‌అదాలత్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దనే ఉద్దేశ్యంతోనే మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు తమ సమస్యలను సామరస్య పూర్వక వాతావరణంలో చర్చించుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి భవానీప్రసాద్, ఎడీఎం నాగరాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహాయాదవ్, సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ, సీనియర్ న్యాయవాధులు, సీఐలు వెంకన్న, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : రాజీయే రాజమార్గమని ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇన్‌చార్జి జడ్జి రాజేశ్ అన్నారు. ఆలేరు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీకివీలైన కేసుల పరిష్కారం చేసుకుంటే డబ్బు, కాలం కలిసివస్తుందని తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి భవిష్యత్‌లో పైకోర్టుకు పోకుండా వీలవుతుందన్నారు. ఈ సందర్భంగా సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కారం అయ్యాయి. కార్యక్రమంలో లోక్ అదాలల్ సభ్యులు ఎ.కిరణ్‌కుమార్, సయ్యద్ మెహినోద్దిన్ , బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడ్ల స్వామి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి సీనియర్ న్యాయవాదులు జూకంటి రవీందర్, గొట్టిపాముల బాబురావు, టి.హరికృష్ణ, జి.సాయికుమార్ పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...