ఆరోగ్య తెలంగాణే టీఆర్‌ఎస్‌లక్ష్యం


Sun,September 9, 2018 12:06 AM

మోటకొండూర్(యాదగిరిగుట్ట టౌన్): ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేశాం. రానున్న రోజుల్లో అనారోగ్యంతో బాధపడుతున్నవారికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో ఆలేరు నియోజక వర్గంలోని 8 మండలాలకు మంజూరైన రూ. 20.40 లక్షల 89 సీఎం సహాయ నిధి చెక్కులను టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి తోపాటు ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్‌లు, టీఆర్‌ఎస్ నాయకుల సమక్షంలో ఆమె పంపిణీ చేశారు. ఆలేరు మండలంలో రూ. లక్షా 46 వేల 500 విలువ గల 10 చెక్కులు, బొమ్మల రామారంలో రూ. 2.35 లక్షల విలువ గల 9 చెక్కులు, తుర్కపల్లి మండలంలో రూ. 1.80 లక్షలు విలువ గల 10 చెక్కులు, రాజాపేట మండలంలో రూ. 1.36 లక్షల విలువ గల 9 చెక్కులు, గుండాల మండలంలో రూ. 2.09 లక్షల విలువ గల 8 చెక్కులు, మోటకొండూర్ మండలంలో రూ. 1.96 లక్షల విలువ గల 6 చెక్కులు, ఆత్మకూరు(ఎం) మండలంలో రూ. 2.27 గల 9 చెక్కులు, యాదగిరిగుట్ట మండలంలో రూ. 7.10 లక్షల విలువ గల 28 చెక్కులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో అందించలేదని సహాయ నిధి చెక్కులను అందజేశామని తెలిపారు. అధికార దాహం కోసం కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు. ఆరోగ్యంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్త శుద్దితో ఉందన్నారు. రాబోవు ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తం చేసినా ఆమె టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చాక వైద్య రంగంలో పెను మార్పులు తీసుకు వస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్ నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...