శ్రీవారికి మాజీ ఎమ్మెల్యే సునీత ప్రత్యేక పూజలు ..


Sun,September 9, 2018 12:05 AM

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం ఆశీర్వచనం చేశారు. ఆలయ ఏఈవో దోర్బల భాస్కర్ శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. యాదాద్రికొండపైన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు తమపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్, ఆలేరు నియోజకవర్గంలో రెండోసారి విజయ ఢంకా మోగాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమంలో కేసీఆర్ మొక్కవోని దీక్షతో పనిచేశారని చెప్పారు. ఆలేరుతో పాటు తెలంగాణలోని అన్ని వర్గాల వారు టీఆర్‌ఎస్‌కే పట్టం కడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలేరు ప్రజల ఆశీస్సులు తమపై ఉండాలని, నియోజకవర్గంలో ప్రతి చెరువులోకి గోదావరి జలాలు తీసుకువచ్చే ఏకైక ఏజెండాగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జడ్పీటీసీ కర్రె కమలమ్మ, టీఆర్‌ఎస్ మండలా ధ్యక్షుడు కర్రె వెంకటయ్య, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీవారి ఖజానా లెక్కింపు ..
శ్రీవారి ఖజానాకు రూ. 24,92,401 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 2,18,596, 100 రూపాయల టికెట్‌తో రూ. 62,500, 150 రూపాయల టికెట్‌తో రూ. 4,38,900, కల్యాణకట్ట ద్వారా రూ. 72,000, వ్రత పూజల ద్వారా రూ. 3,51,500, ప్రసాద విక్రయాలతో రూ. 8,91,510, గదుల విచారణ శాఖ ద్వారా రూ. 1,01,440, శాశ్వత పూజల ద్వారా రూ. 29, 232, ఆర్జితసేవల నుంచి సమకూరినట్లు తెలిపారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...