గర్భిణులకు సామూహిక సీమంతాలు


Sun,September 9, 2018 12:05 AM

భువనగిరి టౌన్ : పోషకాహార వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని అర్బన్‌కాలనీ అంగన్‌వాడీ కేంద్రం-2లో శనివారం సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు నూతన వస్ర్తాలు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం మంజుల, అంగన్‌వాడీ టీచర్ పి.అనితలు పాల్గొని మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే దృక్పథంతోనే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
గౌస్‌కొండలో అవగాహన..
భూదాన్‌పోచంపల్లి: పోషక్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గౌస్‌కొండ అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహారంపై గర్భిణులు, బాలింతలకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సీహెచ్ హేమలత మాట్లాడుతూ పోషకాహార లోపం వల్ల గర్భిణులకు, బిడ్డలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోషక విలువలు మెండుగా ఉండే ఆహారం తప్పక తీసుకోవాలని సూచించారు. పోషకాహార లోపం వల్ల రక్త హీనత ఏర్పడి ప్రసవం సరింగా కాకపోగా పుట్టే బిడ్డలు కూడా బలహీనంగా పుడుతారన్నారు. కిశోర బాలికలు కూడా మంచి పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త సునంద, ఏఎన్‌ఎం వరలక్ష్మి, గీత, ఆశ కార్యకర్త భాగ్యలక్ష్మి, కల్యాణి, సరిత, లలిత పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...