అభివృద్ధి ప్రదాత పైళ్ల శేఖర్‌రెడ్డి


Sun,September 9, 2018 12:05 AM

భువనగిరిరరల్ : భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీల అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ నిధులు రూ.8కోట్ల 78లక్షల 50వేలు మంజూరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుబ్బూరు బీరుమల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన గొప్ప వ్యక్తి శేఖర్‌రెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో అన్ని గ్రామాలు కొత్త కళ సంతరించుకున్నాయన్నారు. అభివృద్ధిలో భువనగిరి నియోజకవర్గం ముందు వరుసలో ఉంచేందుకు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు జనగాం పాండు, మాజీ సర్పంచ్‌ల ఫోరం డివిజన్ అధ్యక్షుడు అబ్బగాని వెంకట్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు సింగిరెడ్డి నర్సిరెడ్డి, చిందం మల్లికార్జున్, రత్నపురం పురుషోత్తం, నోముల మహేందర్‌రెడ్డి, కొండ స్వామి, రాసాల మల్లేశ్‌యాదవ్, జనగాం మహేశ్, హన్మగంటి వెంకటేశ్, కౌకుట్ల శ్రీనివాస్‌రెడ్డి, మెఘావత్ వలియానాయక్ ఉన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...