ఆంథోల్‌మైసమ్మ దేవాలయంలో


Sun,September 9, 2018 12:05 AM

-మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలపరిధిలోని దండు మల్కాపురం శ్రీ ఆంథోల్‌మైసమ్మ దేవాలయంలో విద్యుత్, ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఆయన ఆలయం వద్ద ఆగి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, ఆలయ ఈవో చిట్టెడి వెంకట్‌రెడ్డి, ఆలయ కమటీ మాజీ చైర్మన్ జింకల కృష్ణ ముదిరాజ్, మాజీ డైరెక్టర్లు జొన్నగంటి గోపాల్, కలగోని శ్రీధర్‌గౌడ్, మహంకాళి లక్ష్మయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కొత్త పర్వతాలు యాదవ్, గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేశంగౌడ్, నాయకులు బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, అత్తాపురం భూపాల్‌రెడ్డి, దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...