నందికొండ టూ శ్రీశైలం


Sun,September 9, 2018 12:04 AM

-లాంచీ ప్రయాణం ప్రారంభం
-110 మందితో శ్రీశైలానికి..
-కృష్ణానది తీరం వెంబడి రెండురోజుల ప్రయాణం
-పకడ్బందీగా భద్రతా చర్యలు
నందికొండ : నందికొండ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థ ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నదీ మార్గంలో నందికొండ హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలానికి లాంచీని శనివారం ప్రారంభించారు. తెలంగాణ వాటర్ ప్లూయిట్ జనరల్ మేనేజర్ బాలకృష్ణ, టూరిజం డిప్యూటీ మేనేజర్ సత్యంలతో కలసి ఫారెస్టు డివిజనల్ ఆఫీసర్ గోపి రవి జెండాను ఊపి లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన రెండు బస్సులో పర్యాటకులతో 11 గంటలకు సాగర్ చేరుకొవడంతో, మొత్తం 110 మంది పర్యాటకులతో లాంచీ వెళ్లింది. ఈ సందర్భంగా తెలంగాణ వాటర్ ఫీడ్ ప్లూయిట్ జనరల్ మేనేజర్ బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నందికొండ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం కొనసాగించడం ఇది రెండోసారి అన్నారు. నాగార్జునసాగర్ డ్యాం ఎగువున వర్షాలు విస్తారంగా పడడంతో ఆగస్టు నెలలోనే నీటిమట్టం 575 అడుగులకు పైన చేరడంతోఈ లాంచీ ప్రయాణం కొనసాగింస్తున్నట్లు తెలిపారు.

రెండు రోజుల ప్రయాణంలో కృష్ణమ్మ నదీ తీరం వెంబడి ఉన్న అమ్రాబాద్ నల్లమల్ల అడువుల ప్రకృతి సహజ అందాలు ఇట్టే కట్టిపడేస్తాయన్నారు. పర్యాటకుల కొరకు అన్ని భద్రతలను తీసుకున్నట్లు చెప్పారు. టూరిజం డిప్యూటీ మేనేజర్ సత్యం మాట్లాడుతూ బోజన, రూం వసతి, దర్శనం మరల తిరిగు ప్రయాణంతో రెండు రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వసతులను వివిధ ప్యాకేజీల్లో పర్యాటకులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. . హైదరాబాద్ నుంచి నందికొండ వరకు బస్సు ప్రయాణం ఇక్కడి నుంచి లాంచీలో శ్రీశైలానికి పోయి అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు వెళ్లేందుకు రూ.3వేలు, నందికొండ నుంచి శ్రీశైలానికి లాంచీలో పోయి రావడానికి రూ.2200లు, కేవలం నందికొండ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు రూ.1000 టూరిజం వారు చార్జ్ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ టూరిజం లాంచీ మేనేజర్ హరిబాబు, ఫారెస్ట అధికారులు మోహన్, మంగ్తా పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...