టీఆర్‌ఎస్ పాలనలోనే అభివృద్ధి


Sun,September 9, 2018 12:03 AM

మోత్కూరు : కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా అధికారం వారి కలనేనని.. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిన టీఆర్‌ఎస్‌కే ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నారని తుంగుతుర్తి నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించాక శనివారం తొలి సారిగా తిరుమలగిరికి పార్టీ సమావేశానికి వెళ్తుండగా.. మోత్కూరులో నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు బొట్టు పెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతీరావుపూలే, మహాత్మగాంధీ, జగ్జీవన్‌రామ్, సర్వాయి పాపన్న విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగ్జీన్‌వన్‌రామ్ చౌరస్తాలో ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. సకల జనుల ఉద్యమ స్ఫూర్తితో రాష్ర్టాన్ని సాధించుకొని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పాటు పడుతున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయతో సాగు నీటిని, మిషన్ భగీరథ ద్వారా తాగునీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్లిందన్నారు. రాష్ట్రంలోనే తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో అత్యధికంగా నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మోత్కూరు మినీ ట్యాంకు బండ్ కోసం రూ.4.08కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మోత్కూరు నుంచి పాటిమట్ల వరకు బీటీ విస్తరణకు రూ.10 కోట్లతో పూర్తి చేసినట్లు తెలిపారు. అమ్మనబోల్ నుంచి మోత్కూరు వరకు డబుల్ బీటీ రోడ్డు విస్తరణ పనులు పూర్తికావస్తున్నట్లు తెలిపారు. ప్రతి పల్లే అభివృద్ధికి రూ.3 నుంచి రూ.5 కోట్లతో సీసీ రోడ్ల, ఇతర అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. మోత్కూరు, తిర్మలగిరిల పంచాయతీలను మున్సీపాలిటీలుగా ఏర్పాటుకు కృషి చేసి రూ.20 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు. 40 ఏండ్ల ప్రజల కల అగ్ని మాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పార్టీ అభ్యర్థిగా రెండో సారి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటి చేస్తున్న గాదరి కిశోర్‌కుమార్‌ను అత్యధిక మోజార్టీతో గెలిపించాలన్నారు. మండల, గ్రామాల కోసం పాటుపడిన కిశోర్‌కుమార్‌ను మరో సారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జంగ శ్రీను, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్‌నాథ్, మండల అధ్యక్షుడు కొణతం యాకుబ్‌రెడ్డి, పొన్నాల వెంకటేశ్వర్లు, ప్రమీల, టీఆర్‌ఎస్ నాయలు మేఘారెడ్డి, కొండ సోంమల్లు, కొమ్మడి ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొల్లేపల్లి వెంకటయ్య, పురుగుల వెంకన్న, పోలినేని ఆనందమ్మ, దబ్బెటి శైలజ, స్వామిరాయుడు, శ్రీకాంతచారి, నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...