అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 4.14 కోట్లు


Sat,September 8, 2018 12:02 AM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : చౌటుప్పల్ వా సులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. ఈప్రాంత ప్రజల చిరకాల స్వ ప్నమైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి మా ర్గం సుగమం అయ్యింది. నియోజకవర్గంలోనే అ తి పెద్ద పట్టణమైన చౌటుప్పల్‌లో అండర్‌గ్రౌండ్ ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విన్నవించారు. చౌటుప్పల్ వాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేయాలని కో రారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు మంజూరు చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు.

చౌటుప్పల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ. 4కోట్ల 14లక్షలు మంజూరు అ య్యాయి. నిధుల మంజూరు జీవో కాపీని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి శుక్రవారం మంత్రి కేటీఆర్ అందజేశారు. నిధులు మంజూరు చేయడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...