అభివృద్ధిని చూసి.. ఆశీర్వదించండి


Sat,September 8, 2018 12:02 AM

భువనగిరిరూరల్ : సీఎం కేసీఆర్ సుపరిపాలనే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తుందని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి భువనగిరి మండలం పగిడిపల్లిలోని శివసీతారామాంజనేయస్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు బొట్టుపెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనంత అభివృద్ధి తెలంగాణలో జరిగిందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంటిత దీక్షా-దక్షతలేనన్నారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు .ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పునిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ నువ్వుల ప్రసన్న, వైస్ చైర్‌పర్సన్ బర్రె మహాలక్ష్మి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు జనగాం పాండు, మట్ట ధనుంజయగౌడ్, చిందం మల్లికార్జున్, అంకర్ల మురళి, పెంట నితీశ్, భూక్యా భాస్కర్‌నాయక్, కట్కూరి జంగయ్యగౌడ్, సర్పంచ్‌ల ఫోరం డివిజన్ మాజీ అధ్యక్షుడు అబ్బగాని వెంకట్‌గౌడ్, మాజీ సర్పంచ్ కట్కూరి భాగ్యమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...