నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి


Fri,September 7, 2018 01:00 AM

ఆలేరురూరల్ : నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధైత్వాల ఆగయ్య అన్నారు. గురువారం మండలంలోని కొలనుపాక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బొట్ల బాలురాజు, బి.శ్రీధర్, ఎ.రమేశ్, ఎస్.ఇస్తారి, కె.పోచయ్య, డి.దశమంతరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

పెట్రోలు పోయించుకో.. మొక్కలు పెంచు..
మోటకొండూర్(యాదగిరిగుట్ట టౌన్) : పెట్రోల్ పోయించుకో... మొక్కలు పెంచు అంటూ గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వినూత్న రీతిలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పండ్లు, పూలు, దోమల నివారణకు సిట్రోనెల్లా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోసుకున్న ప్రతి ఒక్కరికీ రెండు మొక్కలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో యాదగిరిగుట్ట పట్టణంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటించాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోయించుకో మొక్కలు పెంచు అనే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సుమారు 5 వేల మొక్కలను పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డమీది స్వప్నారవీందర్ గౌడ్, జడ్పీటీసీ కర్రె కమలమ్మావెంకటయ్య, ఎంపీటీసీలు సీస కృష్ణ, పెట్రోల్‌బంక్ యాజమాని దుస్స యాదగిరి, ఎంపీడీవో మంగళంపల్లి సాంబశివరావు, ఏపీవో కళావతి, ఈసీ రాజశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.

మైనారిటీ గురుకులంలో హరితహరం..
ఆలేరుటౌన్ : ఆలేరు పట్టణంలోని మైనార్టీ గురుకులంలో గురువారం హరితహారం, బాలికలకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 మంది బాలికలు, ఉపాధ్యాయులు క్యాంపస్ ఆవరణలో మెక్కలు నాటారు. అంతకుముందు బాలికలకు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా శారాజీపేట పీహెచ్‌సీ వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కం టి అద్దాలు, మందులు వారికి అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్‌ఎల్‌సీ జమీల్ సిద్ధికి, విజిలెన్స్ అధికారి ఉస్మాన్ ఆలీ, డీఎండబ్ల్యూ అధికారి సత్యనారాయణ, గురుకులం ప్రిన్సిపాల్ ఎండీ అలీమెద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...