రచయితల సంఘం అధ్యక్షుడిగా రంగయ్య


Fri,December 9, 2016 12:25 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ: యాదాద్రి భువనగిరి రచయితల సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా డాక్టర్ పోరెడ్డి రంగయ్య ఎన్నికయ్యారు. గురువారం స్థానిక ఎస్వీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం వ్యవస్థాపకుడిగా డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, గౌరవ సలహాదారుగా సామ మల్లారెడ్డి, అభినయ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బడుగు శ్రీరాములు, డి.శ్రీనివాసాచారి, తిరునగరి శ్రీనివాస్, దేవినేని అరవిందరాయుడు, ప్రధాన కార్యదర్శిగా గుడిపెల్లి వీరారెడ్డి, కార్యదర్శులుగా పెండెం జగదీశ్వర్, రచ్చ సురేశ్, వెంకటనారాయణ, మత్స్యగిరి, కోశాధికారిగా గట్టు రవి, మహిళా కార్యదర్శిగా బండారు జయశ్రీ, ప్రచార కార్యదర్శిగా కాచరాజు జయప్రకాశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో లింగారెడ్డి, డాక్టర్ షేక్ అబ్దుల్ ఘనీ, దుర్గాప్రసాద్, చారి, సత్తయ్య, రెబ్బ మల్లికార్జున్, మెరుగు సదానందం తదితరులు పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...