నేడు రామా చంద్రమౌళి సాహిత్య పురస్కార ప్రదానం


Sun,December 15, 2019 03:18 AM

పోచమ్మమైదాన్‌, డిసెంబర్‌ 14: తెలుగులో కథ, కవిత్వం, నవల, సాహిత్య వ్యక్తిత్వ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రసిద్ధ్ద కవి జూకంటి జగన్నాథానికి రామా చంద్రమౌళి పురస్కారాన్ని అందజేయనున్నట్లు రామా చంద్రమౌళి సాహిత్య పురస్కార ట్రస్ట్‌ ఆచార్య కే పురుషోత్తం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌కు చెందిన రామా చంద్రమౌళి సాహిత్య పురస్కార ట్రస్ట్‌ సంస్థ తరఫున ఈ నెల 15న ఉదయం 10.30కు హన్మకొండ కిషన్‌పురలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో సాహిత్య పురస్కారం-2019ను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ జీవభాషలో, నుడికారంలో అద్భుతమై కవిత్వాన్ని అందిస్తున్న జూకంటి జగన్నాథాన్ని ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా జరిగే సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు హాజరవుతారని తెలిపారు. అలాగే ఈ సదస్సులో రామా చంద్రమౌళి రచించిన ’లోపలి ఖాళీ’ కథ సంపుటి, ఇంగ్లిష్‌ భాషలోకి అనువాదం చేసిన మూడు పుస్తకాలు ’హి అండ్‌ అదర్‌ స్టోరీస్‌', ‘ది పోయిట్రీ ఆఫ్‌ రామా చంద్రమౌళి క్రిటికల్‌ పర్ఫెక్టివ్‌' కవిత్వ వ్యాఖ్యాన గ్రంథం, ‘ఎస్సెన్స్‌ ఆఫ్‌ లైఫ్‌' అనే కథల సంపుటిని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అవార్డుగ్రహీత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ప్రముఖ కథా రచయిత, సినిమా కథకులు పెద్దింటి అశోక్‌కుమార్‌, కథల సంపుటి ’లోపలి ఖాళీ’ సమీక్ష, ప్రసిద్ధ్ద ఆంగ్ల రచయితలు ఆచార్య మిట్టపల్లి రాజేశ్వర్‌, డాక్టర్‌ పీ.వీ లక్ష్మీప్రసాద్‌, డాక్టర్‌ పాలకుర్తి దినకర్‌ ప్రసంగిస్తారన్నారు. వ్యాఖ్యాతగా వల్స పైడి, సంయోజకులుగా తౌటం శ్రీనివాస్‌ వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...