ముగిసిన జిల్లాస్థాయి పాలిటెక్నిక్‌ క్రీడాపోటీలు


Sat,December 14, 2019 04:09 AM

వరంగల్‌ చౌరస్తా, డిసెంబర్‌ 13: వరంగల్‌ ఉమ్మడి జిల్లా అంతర్‌ పాలిటెక్నిక్‌ క్రీడలు శుక్రవారం ముగిసాయి. వరంగల్‌లో శుక్రవారం నిర్వహించిన వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ పోటీల్లో వరంగల్‌ బాలుర, బాలికల జట్లు విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీ.రమేశ్‌రెడ్డి హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని ఇస్తాయని అన్నారు. ప్రతిభ కనబరచిన వారికి ఉజ్వల భవిష్య త్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడోత్సవాల కన్వీనర్‌ డాక్టర్‌ నటరాజశేఖర్‌, శోభారాణి, శ్రీరామ ప్రసాద్‌, గోవర్ధన్‌, డాక్టర్‌ వెంకట నారాయణ, భైరి ప్రభాకర్‌, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...