ఆర్టీసీలో ఎంప్లాయీస్‌ బాక్స్‌ ఏర్పాటు


Sat,December 14, 2019 04:08 AM

సుబేదారి, డిసెంబర్‌ 13: ఆర్టీసీ డిపోల్లో ఎంప్లాయీస్‌ బాక్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు బోర్డు అధికారులు కసరత్తుచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీకి కొత్త రూపు తీసుకువస్తున్న నేపథ్యంలో ప్రతి డిపోలో ఉద్యోగుల సమస్యలను ఫిర్యాదుల ద్వారా డిపో బాక్స్‌లో వేయాలి. వీటిని మానిటరింగ్‌ చేయడానికి హైదారాబాద్‌ బస్‌భవన్‌లో మాటరింగ్‌సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. మరో వా రం రోజుల్లో ఈ విధానం అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. విధి నిర్వహణకు సంబంధించిన విషయాలను బాక్స్‌ ద్వా రా ఉన్నతాధికారులకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదులను డిపో, రీజియన్‌ అధికారులు కాకుండా హైదరాబాద్‌లోని బ స్‌భవన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సెల్‌లోనే పరిశీలించను న్నారు. ఈ బాక్స్‌ ద్వారా ఉద్యోగులు తమ ఇబ్బందులను, సమస్యలను నేరుగా రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...