మానస కుటుంబానికి న్యాయం చేస్తాం


Fri,December 13, 2019 02:29 AM

-డబుల్‌ బెడ్రూం ఇల్లుతో పాటు కుటుంబంలో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగం
-ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

సిద్ధార్థనగర్‌, డిసెంబర్‌12: గత నెల 27న మానసపై లైంగిక దాడితో హత్యకు గురికావడంతో చాలా బాధకరమైందని, ఆ నిరుపేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తోడుంటుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద మానస తల్లి గాదం స్వరూప నిరాహర దీక్ష చేస్తున్న విషయం ఆయన దృష్టికి పోగానే గురువారం ఆయన చేరుకుని మానస తల్లిని ఓదార్చి మాట్లాడారు. నిందితులకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా శిక్షపడేలా చూడాలని కోరామని, అంతేకాకుండా దీన్‌దయల్‌నగర్‌లో నివాసముంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా డబుల్‌బెడ్‌రూంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగం అందిస్తామని తెలిపారు.

అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజలను చైతన్యపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేడు కలెక్టర్‌ పీజే పాటిల్‌ దగ్గరకు తీసుకుపోయి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...