బ్రహ్మకుమారీల సేవలు అభినందనీయం


Mon,December 9, 2019 02:25 AM

-మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు
ఖిలావరంగల్‌, డిసెంబర్‌ 08: శివనగర్‌లోని విశ్వశాంతి భవనం కేంద్రంగా బ్రహ్మకుమారీలు, బ్రహ్మకుమారులు చేస్తున్న సేవలు అభినందనీయమని మహానగర పాలకసంస్థ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. ఆదివారం శివనగర్‌ విశ్వశాంతి భవనం వార్షికోత్సవం సందర్భంగా మేయర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌ మహానగరాన్ని టూరిస్టు, ఆధ్యాత్మిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. మానవ జీవితాన్ని సమూలంగా మార్చడానికి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. బ్రహ్మకుమారీల కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి కార్పొరేషన్‌ నుంచి రూ.50లక్షలు కేటాయించడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు ఆత్మప్రకాశ్‌తోపాటు స్థానికులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles