సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత


Mon,December 9, 2019 02:25 AM

ఖానాపురం(వరంగల్‌ రూరల్‌), డిసెంబర్‌ 08 : బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు ఆదివారం పంపిణీ చేశారు. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన మహ్మద్‌ ఫిరోజ్‌ రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో కాలు, చేయి విరగగా అతడికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.50వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును బాధిత కుటుంబానికి ఎంపీపీ అందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ మేడిద కుమార్‌, వెల్లెపు శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యులు కొలిశెట్టి పూర్ణచందర్‌రావు, మల్యాల పోశెట్టి, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు మచ్చిక అశోక్‌, దేవినేని వేణుకృష్ణ, నాయకులు దాసరి రమేశ్‌, గంగాపురం రాజు, మర్రి రామస్వామి, విజయ్‌, శ్రీనివాస్‌, ఆసిఫ్‌ పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...