శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ పాత్ర కీలకం


Sat,December 7, 2019 02:59 AM

-హోంగార్డ్స్ పిల్లలకు కేంద్ర ప్రభుత్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు
-నిస్వార్థంగా పనిచేస్తే పోలీసుల సహకారం
-మడికొండలోని ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి
- కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

వరంగల్ క్రైం, డిసెంబర్ 06 : శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ చాలా కీలకంగా పని చేస్తున్నారని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ పేర్కొన్నారు. 57వ హోంగార్డ్సు ఆవిర్బావ దినోత్సవాన్ని వరంగల్ పొలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంగార్డ్సు గౌరవందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్, సీపీ రవీందర్ శాంతి కపోతాలను ఎగురవేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హోంగార్డ్సు సంక్షేమానికి ఎంతోగానో కృషి చేస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి మరిన్ని సేవలు అందించాల్సిన బాధ్యత హోంగార్డ్సుపై ఉందన్నారు. పోలీస్ కమిషనర్ సూచన మేరకు మడికొండలో హోంగార్డ్స్ అందజేసిన ఇళ్ల స్థ్ధలాల్లో అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తానని పేర్కొన్నారు. నిస్వార్ధంతో పనిచేస్తే ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం నుంచి సహాయసహకారాలు అందుతాయన్నారు. పోలీస్ కమిషనర్ సిఫార్సు మేరకు పది మంది హోంగార్డ్సు పిల్లలకు కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలైన నవోదయ, కేంద్రీయ విద్యాలయంలో కలెక్టర్‌లో కోటాలో అడ్మిషన్ ఇప్పించడం జరుగుతుందని చెప్పారు.

ప్రమాదబీమా రూ.30 లక్షలు అందించేందుకు ఒప్పందం : సీపీ రవీందర్
హోంగార్డ్సు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాల్లో మరణించే సిబ్బందికి పెద్ద మొత్తంలో ఆర్థికసాయం అందించేందుకు ఆక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకోవడం జరిగిందని సీపీ రవీందర్ పేర్కొన్నారు. ఇకపై అందరూ ఉద్యోగుల లాగానే ప్రతి నెలా 1వ తారీఖున జీతాలు బ్యాంకు నుంచి చెల్లింపులు జరుగుతాయన్నారు. కమిషనరేట్‌లోని 994 మంది హోంగార్డ్సు సంక్షేమ దృష్ట్యా చదువుల్లో రాణిస్తున్న వారి పిల్లలకు రూ.2000 స్కాలర్‌షిప్, కుమార్తె పెళ్లికి రూ.5000 ఆర్థిక సహాయం, మరణించిన కుటుంబాలకు హోంగార్డ్సు ఒక్క రోజు వేతనం రూ.5 లక్షల 50 వేలను అందించడం జరుగుతుందన్నారు. కానిస్టేబుల్స్ కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను హోంగార్డ్సుకు కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో సుధీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్న 11 మంది హోంగార్డులు నర్సయ్య, యాదగిరి, సదానందం, సత్యనారాయణ, ప్రభాకర్, అంజయ్య, శంకరయ్య సాం బయ్య, శ్రీనివాస్, అశోక్, సమ్మయ్యలను సీపీ, కలెక్టర్ జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు భీంరావు, వెంకటలక్ష్మీ, మల్లారెడ్డి, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, సారంగపాణి, బాలస్వామి, హోంగార్డ్స్ ఆర్‌ఐ హతిరాం, ఎంటి విభాగం ఆర్‌ఐ భాస్కర్, వెల్ఫేర్ ఆర్‌ఈ శ్రీనివాస్‌రావు, అడ్మిన్ ఆర్‌ఐ సతీష్, ఆపరేషన్స్ ఆర్‌ఐ నగేశ్, ఇన్‌స్పెక్టర్లు దయాకర్, సత్యనారాయణ, కిశోర్‌కుమార్, పొలీసుల అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...