అతిరుద్ర యాగం పోస్టర్లు ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి


Sat,December 7, 2019 02:57 AM

-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆహ్వానం
రెడ్డికాలనీ, డిసెంబర్ 06: హన్మకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో 200 మంది వేదపండితుల ఆధ్వర్యంలో జరిగే అతిరుద్ర యాగం ప్రచార పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్ అరణ్యభవన్‌లో దేవాదాయ-ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాగకర్త నిర్వాహకుడు తాటిపెల్లి శ్రీనివాస్,రోజారాణి దంపతులు తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, ఆర్యవైశ మహాసభ ఉపాధ్యక్షులు తొనుపునూరి వీరన్న, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 15 నుంచి 21 వరకు అతిరుద్రయాగం, లక్ష్మీనర్సింహాయాగం, శతచంఢీయాగం నిర్వహిస్తున్నందున తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా రుద్రేశ్వరుని కృపకై చేసే యాగంలో తాను పాల్గొంటానని 15న ప్రారంభానికి వస్తానని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి యాగానికి ఆహ్వానించారు. ఇంకా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారిని, వరంగల్ నగర మాజీ మున్సిపల్ కమిషనర్ ప్రస్తుత దేవాదాయశాఖ కమిషనర్ నీతూప్రసాద్‌ను కలిసి అతిరుద్రయాగానికి ఆహ్వానించినట్లు వారు తెలిపారు. ఈ యాగం వలన శాంతి, సౌభాగ్యం ఇతి బాధలు తొలిగిపోతాయని యాగ నిర్వాహకులు తాటిపెల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...