కమ్యూనికేషన్ సిగ్నల్ వ్యవస్థ కీలకం


Sat,December 7, 2019 02:56 AM

-ఐఎస్‌టీఈ జాతీయ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ రాజనరేందర్
భీమారం,డిసెంబర్06: కమ్యూనికేషన్ సిగ్నలింగ్ వ్యవస్థ ప్రస్తుతం కీలకంగా మారిందని ఐఎస్‌టీఈ జాతీయ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ రాజనరేందర్ అన్నారు. కిట్స్ కాలేజీలో శుక్రవారం అడ్వాన్స్‌డ్, కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక అంశాలపై ప్రయోగాలు, పరిశోధనలు చేయాలని సూచించారు. మ్యాట్ ల్యాబ్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్, స్టార్టర్ కిట్ టీఎంఎస్-6711, సిములింక్ సాఫ్ట్‌వేర్లలో అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో ప్రయోగాలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ రమాదేవి, ఐఎస్‌టీఈ చైర్మన్ రఘుబాబు, నర్సింహా, శ్రీకాంత్, సౌజన్య, సుష్మిత, యుగేందర్, శోభనరెడ్డి, నందిని పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...