హంటర్‌రోడ్డులో రక్తదాన శిబిరం


Fri,December 6, 2019 02:30 AM

అర్బన్‌ కలెక్టరేట్‌, డిసెంబర్‌ 05: హన్మకొండ హంటర్‌రోడ్డులోని శ్రీదుర్గా మార్బుల్‌ గ్రానైట్‌ అధినేత వేల్పుల వేణుగోపాల్‌ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సమక్షంలో బర్త్‌డే కేక్‌ను కట్‌చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో కుడా డైరెక్టర్‌ మాడిశెట్టి శివశంకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు డాక్టర్‌ గుండు సదానందం, దేవులపల్లి జానకిరాములు, మాడిశెట్టి శ్యాం, రెడ్‌క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...