రాష్ట్ర స్థాయి త్రోబాల్‌ పోటీలకు ఇద్దరు విద్యార్థులు


Fri,December 6, 2019 02:29 AM

హసన్‌పర్తి, డిసెంబర్‌ 05: మండలంలోని అనంతసాగర్‌ స్పార్కిల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు జిల్లా స్థాయి త్రోబాల్‌ పోటీల్లో అత్యంత ప్రతిభకనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల హెచ్‌ం రణధీర్‌రెడ్డి తెలిపారు. ఆ పాఠశాల ఆవరణలో జరిగిన విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. గత నెల 30వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లా త్రోబాల్‌ అసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ త్రోబాల్‌ ఎంపికలు జరిగినట్లు తెలిపారు. ఈ పోటీలలో పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు మణిరత్నం, నాగతరుణ్‌ త్రోబాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. డిసెంబర్‌ 7, 8వ తేదీల్లో దామెరలో జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్‌ డిస్ట్రిక్ట్‌ త్రోబాల్‌ పోటీల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా జట్టు ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పరిపాలనాధికారి జీ స్వాతిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్‌, కిరణ్‌తో పాటు అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...