పోటీతత్వంతోనే రాణింపు


Thu,December 5, 2019 04:34 AM

-క్రీడలతో మానసిక ఉల్లాసం
-జైళ్లశాఖ వరంగల్‌ రేంజ్‌ డీఐజీ రాజేశ్‌
-నగరంలో ఉత్సాహంగా రీజినల్‌ స్పోర్ట్స్‌ మీట్‌

వరంగల్‌ క్రైం, డిసెంబర్‌04: క్రీడలతో శారీరకంగా..,మానసికంగా దృఢంగా ఉండవచ్చని జైళ్ల శాఖ వరంగల్‌ రేంజ్‌ డీఐజీ వై రాజేశ్‌ అన్నారు. జైళ్ల శాఖ వరంగల్‌ రేంజ్‌ 6వ రీజనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2019 బుధవారం వరంగల్‌లోని ఎల్‌బీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారం భ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైళ్ల శాఖ వరంగల్‌ రేంజ్‌ డీఐజీ వై రాజేశ్‌ హాజరై మాట్లాడారు. క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలన్నారు. పోటీలు వ్యక్తుల మధ్య బంధానికి, పోటీతత్వానికి ఎంతో ఉపకరిస్తాయని చెప్పారు. వరంగల్‌లో జరిగే పొటీల్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులు హైదరాబాద్‌లో జరిగే స్టేట్‌ లేవల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో పాల్గొంటారని చెప్పారు.

ఎల్‌బీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అరుణ డీహెచ్‌రావు మాట్లాడుతూ.. జైలు సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జైలు సూపరింటెండెంట్‌ మురళీబాబు మాట్లాడుతూ.. ఆరు సంవత్సరాల నుంచి జైళ్లశాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నారన్నారు. రెండు రోజుల పోటీల్లో వివిధ ఆటలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప పర్యవేక్షణాధికారి డీ భరత్‌, కాళిదాసు, అమరావతి, సబ్‌జైళ్ల అధికారి ఎం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...