ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో సక్సెస్‌


Thu,December 5, 2019 04:21 AM

-తగ్గుముఖం పడుతున్న సైబర్‌ క్రైమ్‌లు
-ఆకతాయిల పని పట్టేందుకు మఫ్టీలో షీటీంలు
-కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్‌

భీమదేవరపల్లి: రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీస్‌ వి ధానం వల్లనే నేరాలు తగ్గుముఖం పడుతున్నాయని కాజీపే ట ఏసీపీ రవీంద్రకుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని వంగర ఠాణాలో ఎల్కతుర్తి సర్కిల్‌ పరిధిలో జరిగిన పోలీసుల మేథోమథనం అనంతరం సీఐ శ్రీనివాస్‌జీతో క లిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీస్‌ విధానం వల్ల పోలీసుల పనితీరు మెరుగుపడటంతోపాటు నేరపరిశోధనలో వేగం పెరిగిందని తెలిపారు. ప్రతి గ్రామం లో నేనుసైతం, కమ్యూనిటీ సీసీ టీవీలను ఏర్పాటు చేయ డం వల్ల నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు. సైబర్‌ నేరాలను అదుపుచేసేందుకు ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.

వర్టికల్‌ విధానం..
వర్టికల్‌ విధానం ద్వారా నేరాలు చేసిన వారిని కనిపెట్ట డం, రుజువుచేయడం, టెక్నాలజీని పెంపొందించుకోవడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసుల పనితీరు ను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. నేరస్తుడికి తప్పనిసరిగా శిక్షపడేలా నేరం నిరూపించడంతోపాటు అమాయకులను కాపాడే ప్రయత్నం పో లీసులు చేస్తున్నారని వివరించారు.

వంద పీడీ యాక్టులు..
రాష్ట్రంలోనే ప్రథమంగా వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో వంద పీడీ యాక్టులు నమోదు చేశామని తెలిపారు. హన్మకొండలో చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి, హత్య చేసిన నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా నలభై రోజుల్లోనే మరణశిక్ష పడిందని, ఇది దేశంలోనే ప్రథమమని తెలిపారు. నా గారం మర్డర్‌ కేసులో 16 మందికి జీవితఖైదు పడినట్లు తెలిపారు. ధర్మసాగర్‌ మండలంలో పోక్సో ద్వారా నిందితుడికి 20 సంవత్సరాలు తీవితఖైదు పడినట్లు ఉదహరించారు.

ఆపదలో 100కు డయల్‌ చేయాలి..
ఆపద సమయాల్లో 100 నంబర్‌కు డయల్‌ చేయాలని ఏసీపీ రవీంద్రకుమార్‌ తెలిపారు. దీని వల్ల సత్వర స్పందనతోపాటు త్వరితగతిన పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అమ్మాయిలను ఆకతాయిలు వేధింపులకు గురిచేస్తే మఫ్టీలో ఉన్న షీ టీమ్స్‌ వారి పనిపడుతాయని హెచ్చరించారు. ఆకతాయిల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు కేసులు నమోదు చేస్తారని వెల్లడించారు. సమావేశంలో వంగర, ఎల్కతుర్తి ఎస్సైలు ఉపేందర్‌, శ్రీధర్‌ ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...