జనవరి 30 నుంచి ఉడిపి శృంగేరి ధర్మస్థల యాత్ర


Thu,December 5, 2019 04:20 AM

జనవరి 30 నుంచి ఉడిపి శృంగేరి ధర్మస్థల యాత్ర ప్రత్యేక రైలును విజయవాడ నుంచి ఖ మ్మం, వరంగల్‌ మీదుగా ఏర్పాటు చేసినట్లు ఐ ఆర్‌సీటీసీ జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌. సంజీవయ్య తెలిపారు. ‘ఎనిమిది రోజుల పా టు కొనసాగే ఈ యాత్ర హంపి, గోకర్ణం, మురుదేశ్వర్‌, మూకాంబిక, శృంగేరి, ధర్మస్థలం, కుక్కే సుబ్రహ్మణ్యం, ఉడిపి, మైసూర్‌, బేలూర్‌, హళేబీడు దర్శనీయ స్థలాల వరకు కొనసాగుతుంది. రూ.9925 ప్యాకేజీ స్లీపర్‌ క్లాస్‌, 3ఏసీ ప్రయాణానికి రూ.11605 ప్యాకేజీని నిర్ణయించాం. పై రెండు యాత్రలకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ సౌకర్యం కల్పించాం’ అని పే ర్కొ న్నారు. యాత్రలను ఈ ప్రాంత ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని సంజీవయ్య కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, హెల్త్‌ ఇన్స్‌పెక్టర్‌ మీనా, పవన్‌ పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...