వరంగల్‌ మీదుగా భారత్‌ దర్శన్‌ రైలు


Thu,December 5, 2019 04:19 AM


జనవరి 17 నుంచి జగన్నాథ్‌ కామాఖ్య యాత్రఐఆర్‌సీటీసీ జేజీఎం ఎన్‌. సంజీవయ్య
ఖిలావరంగల్‌, డిసెంబర్‌ 04: యాత్రలకు వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కా ర్పొరేషన్‌ లిమిటెడ్‌) మరో శుభవార్త ప్రకటించింది. భారత్‌ దర్శన్‌ టూరిస్ట్‌ ట్రైన్‌లో భా గంగా ‘జగన్నాథ్‌ కామాఖ్య’ యాత్ర విత్‌ ‘గ య’ పేరుతో కొత్త ప్యాకేజీని రూపొందించిం ది. ఇందుకు సంబంధించిన వివరాలను బు ధవారం వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ఐఆర్‌సీటీసీ జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ సంజీవయ్య వెల్లడించారు. ‘జగన్నాథ్‌ కామాఖ్య యాత్ర విత్‌ గయ పేరుతో ఏర్పా టు చేసిన రైలుయాత్ర వచ్చే నెల (జనవరి) 17 సికింద్రబాద్‌లో ప్రారంభమై జనవరి 26న ముగుస్తుంది.

ఈ రైలు వరంగల్‌ మీదుగా ఖమ్మం, విజయవాడవైపు వె ళ్తుంది. పది రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర పూరి జగన్నాథ్‌, లింగరాజ్‌ ఆలయం, దక్షిణేశ్వర్‌ కాళీ ఆల యం, భువనేశ్వర్‌, హౌరా, గౌహతి, గయ, విశాఖపట్టణం, సింహాచలం వరకు మొత్తం తొమ్మిది ప్రదేశాల ను వీక్షించవచ్చు.

యాత్రికులకు రోజు ఒక లీటర్‌ నీళ్ల సీసా, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భో జనం వసతి కల్పిస్తాం. అలాగే రైలు ప్రయాణం తర్వాత దర్శనాలకు వెళ్లేందుకు నాన్‌ ఏసీ బస్సులో ప్రయాణం, డార్మెంటరీ గదుల సౌకర్యం కల్పిస్తాం. యాత్రికులు చె ల్లించాల్సింది స్లీపర్‌ తరగతి ప్రయాణానికి రూ.9450 ప్యాకేజీ, అలాగే 3ఏసీకి అయితే రూ.11550 ప్యాకేజీ రూపొందించాం. ఈ యాత్రా రైలు జనవరి 17న అర్ధరాత్రి 12.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలు దేరి వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు రాత్రి 3.25 గంటలకు చేరుకుంటుంది. అలాగే ఖమ్మం రైల్వేస్టేషన్‌కు ఉదయం 5.30 గంటలకు చేరుకుంటుంది’ అని వివరించారు. ఈ ప్రాం త యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్యాకేజీ వివరాలు, ఇతర సౌకర్యాలతోపాటు టికెట్‌ బుకింగ్‌ కోసం యాత్రికులు ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయం ఫోన్‌ నెంబర్లు 040-27702407, 9701360701, 8287932227/28/29/30లలో సంప్రదించాలని వారు కోరారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...