ఇంటర్‌ విద్యార్థులకు మధ్నాహ్న భోజనం


Thu,December 5, 2019 04:19 AM

-హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌
భీమదేవరపల్లి: ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ అన్నారు. బుధవారం ములుకనూరులోని ల్‌స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్నాహ్న భోజన కార్యక్రమాన్ని జెడ్పీఛైర్మన్‌ మారపల్లి సుధీర్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సొంత ఖర్చులతో మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

విద్యార్థులు కష్టపడి గాకుండా ఇష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు తీసుకురావాలని సూచించారు. పేద విద్యార్థులు అర్థాకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో మధ్నాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్‌ మాడుగుల రాజుకుమార్‌, సభ్యులు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల అనిత, జెడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్‌ మాడుగుల కొంరయ్య, ఎంపీటీసీ మండల సురేందర్‌, ప్రిన్సిపాల్‌ ప్రణయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...