నిందితులను కఠినంగా శిక్షించాలి


Thu,December 5, 2019 04:18 AM

-మృతులకు పలువురి నివాళి..
-పలు చోట్ల కొవ్వొత్తుల ర్యాలీ
మట్టెవాడ, డిసెంబర్‌ 04: దిశపై లైంగిక దాడికి పాల్ప డి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వరంగల్‌ జిల్లా ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. బుధవారం ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఎంజీఎం జంక్షన్‌లో కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు కోలా రాజేశ్‌గౌడ్‌, గజ్జెల రాంకిషన్‌, రత్నవీరాచారి, బింగి సురేశ్‌, గాదె వేణుగోపాల్‌, డాక్టర్‌ రవికుమార్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, ఎండీ అజీంపాషా, కత్తి రమేశ్‌, శ్యాంసుందర్‌, పుల్లూరి వేణు, సదానందం , రమేశ్‌, పశుసంవర్థక శాఖ, టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బల్దియా జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
వరంగల్‌,నమస్తేతెలంగాణ : దిశ, మానసపై లైంగిక దాడి, హత్యలకు నిరసనగా బల్దియా జేఏసీ అధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులకు కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో బల్దియా అదనపు కమిషనర్‌ నాగేశ్వర్‌, కార్యద ర్శి విజయలక్ష్మి, సూపరింటెండెంట్‌ ప్రసన్నరాణి, జేఏసీ అధ్యక్షుడు గౌరీశంకర్‌, గౌరవ అధ్యక్షుడు ధర్మరాజు, నాయకులు బొట్ల రమేశ్‌, రాజారపు భాస్కర్‌, పుల్లా రమేశ్‌, దామోదర్‌, శ్రీనివాస్‌, సత్యం పాల్గొన్నారు.

ఓల్డ్‌ ఫర్నీచర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..
వరంగల్‌చౌరస్తా : ‘దిశ’ నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ ఓల్డ్‌ ఫర్నీచర్‌ అసోసియేషన్‌ శాకరాశికుంట అధ్యక్షుడు మోయిన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఇసుక అడ్డా జంక్షన్‌ నుంచి పోస్టాఫీస్‌ సెంటర్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోయిన్‌ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు వాచస్పతి, సభ్యులు యూనిస్‌, నజీర్‌, యాకుబ్‌ తదితరులు పాల్గొన్నారు.

వెటర్నరీ విద్యార్థుల నిరసన, ర్యాలీ..
మామునూరు : మానవ మృగాలను వెంటనే ఉరి తీయాలనీ డిమాండ్‌ చేస్తూ మామునూరులోని పశువైద్య కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో వరంగల్‌-ఖమ్మం ప్రధాన రహదారిపై నిరసన, ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ బుద్దె ఏకాంబ్రం, ప్రొఫెసర్లు డాక్టర్‌ అశోక్‌, డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ అలెగ్జాండర్‌, డాక్టర్‌ మాధురి, డాక్టర్‌ శివజ్యోతి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...