వైభవంగా సుబ్రహ్మణ్యషష్ఠి


Tue,December 3, 2019 02:55 AM

-వేయిస్తంభాల ఆలయంలోరుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
-స్వామివారి ఉత్సవ విగ్రహాలకుకల్యాణోత్సవం
-శోభాయాత్ర ప్రారంభించినగంగు ఉపేంద్రశర్మ
రెడ్డికాలనీ, డిసెంబర్‌ 02 : వేయిస్తంభాల ఆలయంలో సోమవారం సుబ్రహ్మణ్యషష్ఠి పురస్కరించుకుని రుద్రేశ్వరస్వామికి వైభవంగా పూజలు నిర్వహించారు. ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం నాట్య మండపంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి నవరస పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్య పరిమళాలతో అభిషేకం ఆగమశాస్ర్తాలతో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అంగరంగవైభవంగా కల్యాణోత్సవం నిర్వహించారు. వందలాది మంది భక్తుల సమక్షంలో కల్యాణ కత్రువును నిర్వహించి తీర్థప్రసాదాలు, స్వామివారి తలంబ్రాలు అందించినట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. నల్గొండ జిల్లా నుంచి వచ్చిన దుర్గా భక్తమండలి మహిళలచే కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు సర్పదోశ, కుజ, రాహు, దోశ నివారణ జరగాలని పూజలు చేశారు. తటాక ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి కాపువాడలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివార్ల ఉత్సవ మూర్తులను రుద్రేశ్వరాలయం ముందు నుంచి నృత్య ప్రదర్శనలు చేస్తూ వేలాది మంది భక్తుల జయజయధ్వానాలతో శోభాయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర హన్మకొండ చౌరస్తా, రాగన్నదర్వాజ అలంకార్‌ సెంటర్‌ నుంచి తటాక ఆంజనేయస్వామి దేవస్థానం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకుడు గంటా పవన్‌శర్మ, కమిటీ సభ్యులు డాక్టర్‌ ప్రసాద్‌ వేముల, ఎన్‌ మానసరెడ్డి, రమేశ్‌ పాల్గొన్నారు. ఈ శోభాయాత్రను గంగు ఉపేంద్రశర్మ వేయిస్తంభాల దేవాలయం నుంచి ప్రారంభించారు.

ఉర్సు సుభాశ్‌నగర్‌లో..
వరంగల్‌ చౌరస్తా : ఉర్సు సుభాష్‌నగర్‌లోని శ్రీ నాగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శ్రీవల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహణాధికారి ఆర్‌ కమల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం వసతులు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు జాగర్లపూడి శ్రీరామశర్మ వేదమంత్రోచ్ఛారణల నడుమ శాస్ర్తోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున నుంచి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల పూజలతో ఆలయ ఆవరణలో ఆధ్యాత్మికశోభ సంతరించుకుంది. వందల సంఖ్యలో దంపతులు సామూహిక కల్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కల్యాణం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
శంభులింగేశ్వరాలయంలో..
గ్రేటర్‌ 16వ డివిజన్‌ పరిధి చార్‌బౌళి ప్రాంతంలోని శ్రీభవానీ సహిత శంభులింగేశ్వరాలయ ంలో సోమవారం శ్రీవల్ల్లి దేవసేన సుబ్రహ్మణ్యస్వామి కల్యాణాన్ని వేదపండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రామా చందర్‌రావు ఆధ్వర్యంలో భక్తులకు వసతులు కల్పించారు. కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి రామా రాజేంద్రప్రసాద్‌, వంగరి సురేశ్‌, రామా వెంకట్రాజ్యం, రామావాసు, ప్రధానార్చకులు వీరప్పయ్యచారి, తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...