12 గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్‌


Tue,December 3, 2019 02:54 AM

-నిందితుడి నుంచి రూ.5 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం
-వివరాలు వెల్లడించిన వరంగల్‌ ఏసీపీ
వరంగల్‌ క్రైం, డిసెంబర్‌ : చోరీకి పాల్పడి ఎవరికి దొరకకుండా జల్సాలు చేద్దామనుకున్న నిందితుడిని 12 గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకొని అరెస్ట్ట్‌ చేశారు. వరంగల్‌ ఏసీపీ సాదుల సారంగపాణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజువారీ కూలీగా పనిచేసే ఎండీ రబ్బాని వ్యస నాలకు డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని ప్లాన్‌ వేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుడు ఉండే ప్రాంతంలోనే తాళం ఉన్న ఇళ్లను ఎంచుకొని నవం బర్‌ 30న శనివారం రాత్రి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.5 లక్షల విలువ చేసే 120 గ్రా ముల బంగారు, 36 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.24 వేల నగదు చోరీ చేశాడు. ఈ విషయంలో బాధితుడు ఆదివారం సాయంత్రం మిల్స్‌కాలనీ పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీసీఎస్‌, మిల్స్‌కాలనీ పొలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు కదలికలపై దృష్టి సారించి పక్కా సమాచారం మేరకు ఉర్సు బైపాస్‌ రోడ్డులో సోమవారం నిందితుడిని అదుపులోకి తీసు కున్నారు. ఆరా తీయగా నేరాన్ని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి చోరీ చేసిన సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. క్రైం ఏసీపీ బాబురావు, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు రమేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌రావు, మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌కుమార్‌, సీసీఎస్‌ సిబ్బంది వీఎస్‌రావు, వీరస్వామి, జంపయ్య, వంశీ, రాజశేఖర్‌, విశ్వేశ్వర్‌లను సీపీ అభినందిం చినట్లు ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...